- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణలో గురువారం నుంచి ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ సూచించింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ప్రధానంగా ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో కురుస్తాయని పేర్కొంది. 19, 20, 21వ తేదీల్లో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయని సూచించింది. ఈ మేరకు ‘పసుపు’ రంగు హెచ్చరికలు జారీ చేసింది. కర్ణాటక నుంచి నైరుతి బంగాళాఖాతం వరకు ఏర్పడిన ద్రోణి మంగళవారం తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు విస్తరించిందని తెలిపింది.
- Advertisement -



