- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : మంగళవారం నాటి భారీ పతనం నుంచి భారత స్టాక్ మార్కెట్లు బుధవారం స్వల్పంగా కోలుకున్నాయి. ట్రేడింగ్ ప్రారంభంలో సెన్సెక్స్, నిఫ్టీ లాభాలతో మొదలయ్యాయి. ఉదయం సెన్సెక్స్ 245 పాయింట్ల లాభంతో 74,249 వద్ద, నిఫ్టీ 83 పాయింట్లు పెరిగి 23,201 వద్ద ట్రేడ్ అయ్యాయి. జీఐఎఫ్‌టీ నిఫ్టీ నుంచి అందిన సానుకూల సంకేతాలు మార్కెట్లకు ఊతమిచ్చాయి.
కాగా, మంగళవారం ట్రేడింగ్‌లో సూచీలు కుప్పకూలిన విషయం తెలిసిందే. సెన్సెక్స్ 777 పాయింట్లు పతనం కాగా, నిఫ్టీ 279 పాయింట్లు నష్టపోయి 23,118 వద్ద ముగిసింది.
- Advertisement -


