Saturday, June 27, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నిండు జీవితానికి రెండు చుక్కలు

నిండు జీవితానికి రెండు చుక్కలు

- Advertisement -

నవతెలంగాణ –  మిరుదొడ్డి 
మండలంలోని వివిధ గ్రామాల్లో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వైద్యాధికారి దివ్య శ్రీ తెలిపారు. పోలియో వ్యాధి నిర్మూలన లో భాగంగా ఐదేళ్ల లోపు పిల్లలు అందరికీ పోలియో చుక్కలు వేయడం జరుగుతుందనీ చెప్పారు. మండలం లోని వివిధ గ్రామాల్లో 2162 మంది ఐదేళ్ళ లోపు పిల్లలను గుర్తించినట్లు వివరించారు. వీరికి చుక్కలు వేయడానికి 11 పోలియో కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆదివారం పోలియో కేంద్రాల్లో చుక్కలు వేయడం జరుగుతుందనీ తెలిపారు,  ఆదివారం చుక్కలు వేసుకోనీ వారి కోసం  సోమవారం, మంగళవారం ఇంటి ఇంటికి పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు.  తల్లిదండ్రులు, ప్రజా ప్రతినిధులు సహకరించి కార్యక్రమాన్నీ విజయవంతం చెయ్యాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -