Thursday, August 6, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఎన్టీఆర్‌ స్ఫూర్తితో..

ఎన్టీఆర్‌ స్ఫూర్తితో..

- Advertisement -


నందమూరి తారక రామారావు సతీమణి బసవ రామ తారకం శతజయంతి సందర్భంగా ప్రారం భించిన నందమూరి బసవరామ తారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అస్సాం వరద బాధితులకు నిత్యవసర వస్తువులు పంపిణీ జరిగింది. భారీ వర్షాల కారణంగా వరదలలో చిక్కుకుని ఎంతో నష్టపోయిన బాధితులకు అండగా నిలబడా లని ఈ ట్రస్ట్ ద్వారా నిత్యవసర వస్తువులను అందజేశారు. నేడు అస్సాం వరద బాధితులకు ది ఎంబ్రాయ్స్‌ ఎన్జీవో సంస్థ (THE EMBRYOS) ద్వారా వీటిని పంపిణీ చేశారు. తెలుగు రాష్ట్రాలలోని హైదరాబాద్, విజయవాడ, ఖమ్మంతో పాటు ఇతర దేశాల నుండి కూడా ఈ ట్రస్ట్ ద్వారా సేవ చేసేందుకు ప్రజలు ముందుకు రావడం విశేషం. ఈ సందర్భంగా నందమూరి మోహనకృష్ణ, ‘సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని నమ్మే మనందరి అన్న రామారావు మాటలను స్ఫూర్తిగా తీసుకొని మానవత్వంతో ప్రజాసేవ చేస్తున్నాం. అందులో భాగంగా నందమూరి బసవరామ తారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మన పొరుగు రాష్ట్రమైన అస్సాంలో వరదల వల్ల నష్ట పోయిన ప్రజలకు అండగా నిలుస్తూ, నిత్యవసర వస్తువులను పంపిణీ చేస్తున్నాం. ఈ ట్రస్ట్ ద్వారా అందరికీ సహాయం చేస్తూ, అండగా ఉండాలని కోరుకుంటున్నాం. దీని కోసం ది ఎంబ్రాయ్స్‌ అనే సంస్థ ద్వారా ఈ నిత్యవసర సరుకులను అందించి నందుకు సంతోషంగా ఉంది’ అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -