హీరో వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’గా నేడు (శుక్రవారం) ప్రేక్షకులను అలరించడానికి వస్తు న్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సం యుక్తంగా నిర్మించాయి. నేడు (శుక్రవారం) రిలీజ్ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో గురువారం ప్రీమియర్స్ ప్రదర్శిం చారు. ప్రీబుకింగ్స్ అద్భుతంగా ఉన్నాయి. ఈ సందర్భంగా హీరో వరుణ్ తేజ్ మీడియాతో ముచ్చటించారు. ఈ కథ విన్నప్పుడు ఇందులో ఉన్న ఎంటర్‌టైన్ మెంట్ నాకు చాలా నచ్చింది. గాంధీ ఈ కథ చెప్పినప్పటి నుంచి నేను నవ్వుతూనే ఉన్నాను. నేను ఏ కథ విన్నా, థియేటర్‌లో కూర్చొని సినిమా చూస్తున్న ప్రేక్షకుడిలాగే వింటాను. ప్రతి నటుడి లాగే నాకు కూడా వైవిధ్యమైన పాత్రలు చేయాలని ఉంటుంది. ఆ క్రమంలో కొన్ని సీరియస్ పాత్రలు కూడా చేశాను. కోవిడ్ తర్వాత ఎక్కువగా సీరియస్, భారీ యాక్షన్ వచ్చాయి. ఎప్పటినుంచో ఒక మంచి ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా చేయాలని ఉండేది. ప్రేక్షకులు రెండున్నర గంటల పాటు రిలాక్స్ అయి, నవ్వుకునే సినిమా చేయాలనే ఉద్దేశంతో ఇందులో నటించాను. సినిమా చాలా బాగా వచ్చింది. అందుకే ఇంత కాన్ఫిడెంట్‌గా ప్రమోట్ చేయగలిగాం. దర్శకుడు గాంధీ, రితిక, సత్య… అందరూ ఈ సినిమాను తమ సొంత సినిమాలా భావించి ప్రమోషన్స్ చేశారు.
టీజర్, ట్రైలర్ చూసి ప్రేక్షకులే సినిమా చూడాలని నిర్ణయించుకున్నారు. ఆ స్పందనే ఇప్పుడు బుకింగ్స్‌లో కనిపిస్తోంది. సత్యతో కలిసి చేసిన మూడో సినిమా ఇది. సత్యను కేవలం కమెడియన్‌గా మాత్రమే చూడకూడదు. తనలో మంచి నటుడు కూడా ఉన్నాడు. ఈ సినిమాలో మా ఇద్దరి పాత్రలు చాలా కీలకం. ప్రేక్షకులు ఆ రెండు పాత్రలతో కనెక్ట్ కావాలంటే మేమిద్దరం చాలా హోమ్‌వర్క్ చేశాం. రాయలసీమ యాస నేర్చుకుని, కామెడీ టైమింగ్‌పై ప్రత్యేకంగా వర్క్ చేశాం. మా ఇద్దరి కెమిస్ట్రీని ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు. రెండు విభిన్న పాత్రలు చేయడం ఒక నటుడిగా ఇది నాకు చాలా ఛాలెంజింగ్ రోల్. రెండు విభిన్న మైన బాడీ లాంగ్వేజ్‌లు, రెండు భిన్నమైన మన స్తత్వాలు చూపించే అవకాశం రావడం చాలా సంతోషంగా అనిపించింది. నటుడిగా చాలా తృప్తిని ఇచ్చింది. ‘కంచె, అంతరిక్షం’ నిర్మాతలు రాజీవ్, వంశీ తో చేసిన 3వ సినిమా ఇది. ఇద్దరూ కలిసి సినిమాకు కావాల్సిన పూర్తి సపోర్ట్ ఇచ్చారు. ఈ సినిమా విషయంలో ప్రేక్షకులకు ఒకటే చెప్పాలనుకున్నా, ఇది నాన్‌స్టాప్ ఫన్ ఎంటర్‌టైనర్. కడుపుబ్బా నవ్వించే సినిమా. చాలా టైట్ స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తుంది.
ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించే ‘కొరియన్ కనకరాజు’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



