Thursday, August 6, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇంటింటికి మొక్కల పంపిణీ

ఇంటింటికి మొక్కల పంపిణీ

- Advertisement -

నవతెలంగాణ-ఆర్మూర్ 
మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఒకటవ వార్డులో చైర్ పర్సన్ గోనె లహరి రఘు, కమిషనర్ శ్రీహరి రాజు, AMC చైర్మన్ సాయిబాబా గౌడ్ లతో కలిసి గురువారం ఇంటింటికి మొక్కలు పంపిణీ చేశారు. చైర్ పర్సన్  మాట్లాడుతూ పట్టణంలో మరింత పచ్చదనాన్ని పెంచేందుకు ఇంటింటికి ఉచితంగా మొక్కలు పంపిణీ చేస్తున్నామని అన్నారు. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించి, పరిశుభ్రమైన వాతావరణంలోని అందించడానికి ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలు తమ ఇంటి వద్ద ఇచ్చిన మొక్కను నాటి సంరక్షించాలని సూచించారు. AMC చైర్మన్ సాయిబాబా గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ సడక్ వినోద్, నాయకులు విజయ అగర్వాల్, సానిటరీ సూపర్వైజర్ నరేందర్, పర్యావరణ ఇంజనీర్ పూర్ణమౌళి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -