Wednesday, September 16, 2026
E-PAPER
Homeజాతీయంమీడియా స్వేచ్ఛపై పోలీసుల దాడి: ఎంఏ బేబీ

మీడియా స్వేచ్ఛపై పోలీసుల దాడి: ఎంఏ బేబీ

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: రిపోర్టర్ టీవీ కార్యాలయంపై పోలీసుల దాడి మీడియా స్వేచ్ఛపై జరిగిన దాడి అని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ ఆరోపించారు. కొంతమంది పోలీసు అధికారులు రిపోర్టర్ టీవీ కార్యాలయంలోకి ప్రవేశించి అసాధారణ రీతిలో వ్యవహరించారని ఆయన పేర్కొన్నారు. పోలీసుల చర్యల కారణంగా కార్యాలయంలో భయాందోళన వాతావరణం నెలకొని, ఛానల్ ప్రసారాలు సుమారు గంటపాటు నిలిచిపోయాయని ఎంఏ బేబీ తెలిపారు. మీడియా సిబ్బంది ఫోన్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారని ఆయన ఆరోపించారు.

ఇందిరా గాంధీ హయాంలో ఎమర్జెన్సీ విధించి మీడియాను నిశ్శబ్దం చేసిన సందర్భాన్ని ఎంఏ బేబీ ప్రస్తావించారు. అయితే అప్పట్లో కూడా మీడియా సంస్థల్లోకి ప్రవేశించి భయానక వాతావరణం సృష్టించడం, హింసకు పాల్పడటం వంటి ఘటనలు వినలేదని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మీడియా వన్ ఛానల్ ప్రసారాలను నిలిపివేసినప్పుడు దానికి వ్యతిరేకంగా అందరూ ఏకతాటిపై నిలిచారని ఎంఏ బేబీ గుర్తుచేశారు. ప్రజాస్వామ్య సమాజంలో మీడియా స్వేచ్ఛ అంతర్భాగమని పేర్కొన్న ఆయన.. మీడియాపై దాడులు, బెదిరింపులు వీడీ సతీశన్ ప్రభుత్వం నుంచే వస్తున్నాయని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -