Wednesday, September 16, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్ఈ రోజే రాజీనామా చేస్తా...ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

ఈ రోజే రాజీనామా చేస్తా…ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

- Advertisement -

నవతెలంగాణ ఆర్మూర్ : గత రెండేండ్లుగా ముఖ్యమంత్రి దృష్టికి, రెవెన్యూ మంత్రి దృష్టికి సమస్యలు తీసుకెళ్తున్న పట్టించుకోవడంలేదని అవసరమైతే ఈరోజే రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసినారు. అసెంబ్లీ సమావేశాల లో భాగంగా బుధవారం ఆయన మాట్లాడుతూ వంద ఏండ్ల క్రితం నిజాం కాలంలో కట్టిన ఆర్మూర్‌లో రెవెన్యూ కార్యాలయం కట్టాలని తాను కోరుతున్నానని.. అయినా ఎందుకు పట్టించుకోవడం లేదని రాకేశ్ రెడ్డి ప్రశ్నించారు. కార్యాలయం కూలిపోయే పరిస్థితిలో ఉందని, సబ్ కలెక్టర్ కార్యాలయం సైతం ఒక అటెండర్ స్థాయి అధికారులు ఉండే విధంగా ఉందని అన్నారు. మంత్రుల జిల్లాలకు ఎక్కువ నిధులు తీసుకెళ్తున్నారని.. తమ నియోజకవర్గాలను పట్టించుకోకపోతే ఈ రోజే రాజీనామా చేస్తానని చెప్పుకొచ్చారు. నిజామాబాద్ ఎవరికి పట్టని జిల్లా అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిజామాబాద్ అభివృద్ధి విషయం గురించి సభలో మాట్లాడనివ్వకపోతే రాజీనామా చేస్తానని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -