కో కన్వీనర్లగా అశుతోష్ రాంకా, సౌరభ్ దాస్
12 మందితో కాక్రోచ్ పార్టీ జాతీయ కమిటీ
నవతెలంగాణ – న్యూఢిల్లీ బ్యూరో
ఇన్‌స్టాగ్రామ్ మీమ్స్‌తో ప్రారంభమైన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ), నీట్ అవకతవకలపై నిరసన గళమెత్తి.. కేంద్ర మంత్రి రాజీనామా డిమాండ్‌తో రోడ్డుపైకి వచ్చి ఉద్యమాన్ని నిర్వహించి విజయం సాధించింది. ఇప్పుడు సీజేపీ దేశవ్యాప్తంగా విస్తరించేందుకు కార్యాచరణ రూపొందించింది. అందులో భాగంగానే 12 మందితో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. జాతీయ కన్వీనర్‌గా అభిజీత్ దీప్కే, కో కన్వీనర్లుగా అశుతోష్ రాంకా, సౌరభ్ దాస్, నేషనల్ ఆర్గనైజేషన్ ఇన్‌చార్జ్‌గా అజింక్యా షిండే, కో ఇన్‌చార్జ్‌గా దీపక్ బలియన్, జాతీయ కార్యదర్శిగా ఆఫ్రీన్ నవాజ్, మీడియా ఇన్‌చార్జ్‌గా విజయ్ రెడ్డి మల్లంగి (తెలుగు వ్యక్తి), న్యాయ వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా రత్నసింగ్, రీసెర్చ్ అండ్ పాలసీ ఇన్‌చార్జ్‌గా వైష్ణవి గౌర్, టెక్నాలజీ ఇన్‌చార్జ్‌గా రోహన్ దేశ్‌పాండే, ఫైనాన్స్ ఇన్‌చార్జ్‌గా యోగేష్ ఇంగాలే నియామకం అయ్యారు. జోనల్ వారీగా నార్త్ జోన్ ఇన్‌చార్జ్‌గా దీపక్ బలియన్, దక్షిణ జోన్ ఇన్‌చార్జ్‌గా విజయ్ రెడ్డి మల్లంగి, తూర్పు, ఈశాన్య జోన్ ఇన్‌చార్జ్‌గా అంకిత్ భరద్వాజ్, పశ్చిమ జోన్ ఇన్‌చార్జ్‌గా యోగేష్ ఇంగలే నియామకం అయ్యారు. రాబోయే ఆరు నెలల్లో సీజేపీ దేశవ్యాప్తంగా రాష్ట్ర సమన్వయ కమిటీలతో పాటు లోక్‌సభ, నగర స్థాయి సమన్వయ విభాగాలను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది.



