Wednesday, February 25, 2026
E-PAPER
Homeజిల్లాలుపాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిందితులను కఠినంగా శిక్షించాలి: సీపీఐ(ఎం)

పాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిందితులను కఠినంగా శిక్షించాలి: సీపీఐ(ఎం)

- Advertisement -

నవతెలంగాణ – మునిపల్లి
నాగర్ కర్నూలు జిల్లాలో కమ్మెర గ్రామంలో మల్లన్న దర్శనం కోసం వెళ్లిన రజక చంద్రకళ కుటుంబాన్ని అడ్డుకుని దాడి చేసి రెండు నెలల పసిపాప మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని మునిపల్లి  మండ‌ల నాయకులు రమేష్ గౌడ్. నాయకులు రమేష్ గౌడ్ ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం అయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రజక కులానికి చెందిన చంద్రకళ అతని కుమారుడు గణేశ్  మల్లన్న దేవుడి దర్శనానికై వెళ్తుండ‌గా కొంతమంది అగ్రకులాల వారు కుల దుర అహంకారంతో దేవాలయ ప్రవేశంన్ని అడ్డుకుని మహిళా అని చూడకుండా విచక్షణంగా బూతులు తిడుతూ దారుణంగా దాడి చేశారని అన్నారు. అడ్డుకోబోయిన యువకుడ్ని కూడా మూడు గంటలపాటు నిర్బంధించి చిత్రహింసలకు గురి చేశారని తెలిపారు. ఈ దాడిలో రెండు నెలల పసిపాపను తన్ని చంపారని, ఇంతటి దారుణమైన ఘటన జరగడంపై, పసిపాప మృతి చెందడంపై ఆవేద‌న వ్య‌క్తం చేశారు. 

 అభం శుభం ఎరగని పసిబిడ్డ మరణానికి కారణమైన వారందరిపై,అలాగే స్థానిక సర్పంచ్ తో సహా అందరి మీద హత్య కేసు నమోదు చేసి పాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిందితులను కఠినంగా శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని, నిందితులకు వర్తస్తు పలికిన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని కోరారు, పసిపాప వృత్తికి కారణమైన వారిని శిక్షించాలని రోజు జిల్లా కేంద్రాలలో నిరసనలు జరుగుతున్న ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు, ఇప్పటికైనా స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకొని పాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -