Wednesday, February 25, 2026
E-PAPER
Homeజిల్లాలుఈజిఎస్,శానిటేషన్ పనులపై ఎంపీడీవో పరిశీలన

ఈజిఎస్,శానిటేషన్ పనులపై ఎంపీడీవో పరిశీలన

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని పెద్దమల్లారెడ్డి, భిక్కనూర్ గ్రామాలలో ఎంపీడీవో రాజ్ కిరణ్ రెడ్డి గ్రామాల్లో కొనసాగుతున్న ఈజిఎస్ పనులు, నర్సరీ అభివృద్ధి కార్యక్రమాలు, శానిటేషన్ పనులను ప్రత్యక్షంగా సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ప్రజలకు ఉపాధి కల్పించి ఈజిఎస్ పనులు నాణ్యతగా, సమయానికి పూర్తి చేయాలన్నారు. నర్సరీలో మొక్కల సంరక్షణ, నీటి వసతి వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. అలాగే గ్రామ శుభ్రత, పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని శానిటేషన్ సిబ్బందికి సూచనలు చేశారు. ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించేందుకు శానిటేషన్ పనులు నిరంతరం కొనసాగాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో కార్యదర్శులు మహేష్ గౌడ్, లక్ష్మీ, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -