నవతెలంగాణ – మునుగోడు
మునుగోడు మండలంలోని బీరెల్లి గూడెం గ్రామం కు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో మంజూరైన ఐదు లక్షల ఎన్.ఆర్.ఇ .జి .ఎస్ ఫండ్స్ ద్వారా సీసీ రోడ్ల నిర్మాణంకు నిధులు మంజూరు కావడంతో బుధవారం గ్రామ సర్పంచ్ దాసరి గోవర్ధన్ యాదవ్ సీసీ రోడ్డు నిర్మాణం కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి గ్రామ అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయించి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని అన్నారు. సీసీ రోడ్డు నిర్మాణం కు నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యేకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఉప సర్పంచ్ దోటి వెంకటేశ్వర్లు, గ్రామ శాఖ అధ్యక్షుడు దాసరి సత్యనారాయణ, వార్డు సభ్యులు దాసరి మహారాజ్, అయిత గోని సుజాత అశోక్, గ్రామ ప్రజలు దాసరి రాములు, వెంపాల నరసింహ, దోటి శ్రీనివాస్, బొల్లం జంగయ్య, వెంపాల రాజమల్లి, బూడిద లింగస్వామి, దోటి తిరుమలేష్, వెంపాల లింగస్వామి, దాసరి లింగయ్య తదితరులు ఉన్నారు.



