నవతెలంగాణ – ఆలేరు రూరల్
ఆలేరు మండలం సాయిగూడెం గ్రామంలోని బేతి అంజిరెడ్డి వ్యవసాయ క్షేత్రంలో ఆయిల్ పామ్ పంటపై, మామిడి తోటలలో చేపట్టవలసిన సస్యరక్షణ కార్యక్రమాలపై రేపు ఉదయం 10.00 గంటలకు అవగాహన సదస్సు నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ పరిశోధకులు మరియు నిపుణులు రైతులకు పంటల సంరక్షణ, ఎరువుల వినియోగం, పురుగుమందుల నిర్వహణ, వ్యాధి నియంత్రణ వంటి అంశాలపై సమగ్ర సూచనలు అందించనున్నారు. ముఖ్యంగా మామిడి పంటలో దిగుబడి పెంచేందుకు ఉపయోగించే ఫ్రూట్ కవర్ల వినియోగ విధానం, వాటి ప్రయోజనాలపై ప్రత్యేకంగా అవగాహన కల్పించబడుతుంది. కావున ఆలేరు మండలంలోని ఆయిల్ పామ్ మరియు మామిడి రైతులు ఈ అవగాహన సదస్సులో పాల్గొని నిపుణుల సూచనలు తెలుసుకొని లాభపడవలసిందిగా నిర్వాహకులు కోరుతున్నారు.
ఆయిల్ ఫామ్ – మామిడి రైతులకు అవగాహన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



