నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండల కేంద్రంలోని బస్వాపూర్ జిపి పరిధిలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల మొదటి రోజు పరీక్ష ల నిర్వహణను జుక్కల్ తహసిల్దార్ మారుతి బుధవారం పరీక్ష కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పరీక్ష కేంద్రంలో నీ గదులను పరిశీలించారు. అనంతరం అధ్యాపకులతో మాట్లాడుతూ మాస్ కాపీయింగ్ జరగకుండా జాగ్రత్త వహించాలని అన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్ల పరీక్ష కేంద్రాలలో మీ అన్ని గదులలో సిసి కెమెరాలు నీడలో పరీక్షల నిర్వహణ పకడ్బందీగా జరుగుతోందని అందరు సహకరించి పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పిల్లలకు తగు సూచనలు చేసి ఇటువంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలని అన్నారు. అనంతరం పని పరీక్ష కేంద్రం వద్ద పోలీసు బందోబస్తు పరిశీలించారు. బయట వ్యక్తులు లోపలికి రాకుండా పరీక్ష కేంద్రం పరిధిలోని 144 సెక్షన్ విధించడం జరిగిందని అన్నారు. పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసే కార్యక్రమంలో తాసిల్దార్ తో పాటు గిర్ధావర్ రామ్ పటేల్, జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.
ఇంటర్ పరీక్షా కేంద్రాన్ని సందర్శించిన తాహశీల్దార్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



