– జిల్లా అకడమిక్ మోనటరింగ్ ఆఫీసర్ నాగరాజు శేఖర్
నవతెలంగాణ – అశ్వారావుపేట
మానవీయ విలువలను పెంపొందించడమే కాకుండా సాహిత్యం చైతన్యాన్ని ప్రోది చేస్తుందని విద్యాశాఖ జిల్లా మానిటరింగ్ అధికారి అమృతలూరి నాగరాజశేఖర్, ప్లానింగ్ కోఆర్డినేటర్ సతీష్ కుమార్ ,కమ్యూనిటీ మొబిలైజేషన్ అధికారి సైదులు అభిప్రాయపడ్డారు. భానూదయ సాహిత్య సంస్థ ,మండలవిద్యాశాఖ అశ్వారావుపేట ఆధ్వర్యంలో నిర్వహించిన శతాధిక బాల కవిసమ్మేళనం ఆద్యంతం అలరించింది.
స్థానిక సూర్యస్కూల్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై మండల విద్యాధికారి పి.ప్రసాదరావు అధ్యక్షతన జరిగిన ప్రారంభసమావేశంలో కాంప్లెక్సు ప్రధానోపాధ్యాయురాలు పరుచూరి.హరిత జ్యోతిప్రకాశనం చేసి కవిసమ్మేళనాన్ని ప్రారంభించారు.విద్యార్ధులలో దాగిన సృజనాత్మకతలను వెలికి తీసేందుకే ఈ కవి సమ్మేళనాన్ని నిర్వహించినట్లు యం.ఇ.ఓ ప్రసాదరావు తెలిపారు .
ఈ సమావేశంలో జిల్లావిద్యాశాఖ ఏ.యం.ఓ నాగరాజశేఖర్ మాట్లాడుతూ అన్ని భాషలలోకెల్లా తెలుగు భాష అమృతం వలె ఉంటుందని,ఆ భాషానైపుణ్యాలను పెంపొందించడానికి విద్యార్ధులలో ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని అన్నారు. సతీష్ కుమార్ మాట్లాడుతూ విద్యార్ధులలో చిన్నతనం నుండే ఆంగ్లం వెంట పరుగులు పెట్టించడం సరికాదని మాతృభాషను కూడా నేర్పాలని కవిత్వంలో విద్యార్ధులను తీర్చిదిద్దడం లో ఉపాధ్యాయుల కృషి అనిర్వచనీయమని అన్నారు.
సీ.యం.ఒ సైదులు మాట్లాడుతూ విద్యార్ధులను సాహిత్యం వైపు నడిపిస్తే మేథస్సు పెరుగుతుందని పద్యం ,కవిత్వం వంటి వాటిలో తర్ఫీదునివ్వడం అభినందనీయమని అన్నారు. ఈ కవిసమ్మేళనం 11 ఆవృతాలలో నిర్వహించగా 110 మంది విద్యార్ధులు పాల్గొన్నారు. వివిధ అంశాలపై తమ కవిత్వాన్ని వినిపించారు.
ఈ కార్యక్రమంలో కాంప్లెక్సు ప్రధానోపాధ్యాయులు పి.హరిత ,షాహీనా బేగం, కొండలరావు, వీరేశ్వరరావు, సూర్యస్కూల్ ప్రిన్సిపాల్ పోతన రాంబాబు, డైరెక్టర్ జాహ్నవి, భానూదయ అధ్యక్షులు సిద్ధాంతపు ప్రభాకరాచార్యులు పాల్గొనగా వివిధ ఆవృతాలకు అధ్యక్షులుగా ఫణికుమారి, సునీతాదేవి,రాంచంద్రరావు, మడిపల్లి వెంకటేశ్వరరావు, నాగేశ్వరరావు,సునీతాదేవి,కృష్ణ, కమల వాహిని, రమాదేవి తదితరులు వ్యవహరించారు.



