నవతెలంగాణ – కాటారం
రోడ్డు ప్రమాదాల నివారణ, సైబర్ నేరాలపై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా కాటారం పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ ఆకుల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ‘Arrive Alive’ క్యాంపెయిన్ కార్యక్రమం మాంటెసోరి హైస్కూల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు రోడ్ సేఫ్టీ నిబంధనలు, ట్రాఫిక్ నియమాల ప్రాముఖ్యత, హెల్మెట్ వినియోగం, వేగ నియంత్రణ వంటి అంశాలపై వివరించారు. అలాగే పెరుగుతున్న సైబర్ ఫ్రాడ్స్ (ఆన్‌లైన్ మోసాలు) గురించి అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద లింకులు, ఫోన్ కాల్స్, ఓటీపీ షేరింగ్ వంటి వాటిని నివారించాలని సూచించారు.
అదేవిధంగా సీసీ కెమెరాల (CC Cameras) అవసరం గురించి కూడా వివరించి, పాఠశాలలు, గ్రామాలు, వాణిజ్య ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల నేరాల నివారణకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని పోలీస్ శాఖ చేపట్టిన అవగాహన కార్యక్రమాన్ని అభినందించారు.



