Wednesday, February 25, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఉదయ్

ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఉదయ్

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలం కోనాపూర్ గ్రామానికి చెందిన మోర్తాడ్ ఉదయ్ తెలంగాణ రాష్ట్ర ఎస్సీ సంక్షేమ సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం రాష్ట్ర ఎస్సీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కమలాకర్, మోర్తాడ్ ఉదయ్ తెలంగాణ రాష్ట్ర ఎస్సీ సంక్షేమ సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా నియామక పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా మోర్తాడ్ ఉదయ్ మాట్లాడుతూ.. ఎస్సీల హక్కుల పరిరక్షణతో పాటు వారి సమగ్ర అభివృద్ధి కోసం తనవంతుగా నిర్విరామంగా కృషి చేస్తానని తెలిపారు.రాష్ట్ర ఎస్సీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కమలాకర్ తనపై  ఉంచిన నమ్మకాన్ని మమ్ము చేయకుండా నిలబెట్టుకుంటానన్నారు.ఎస్సీ వర్గాల సంక్షేమం, విద్యా, ఆర్థిక అభివృద్ధి కోసం ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.తన నియామకానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -