Wednesday, February 25, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బషీరాబాద్ లో కుంట కట్ట చదును పనులు

బషీరాబాద్ లో కుంట కట్ట చదును పనులు

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండలంలోని బషీరాబాద్ గ్రామంలోని 2వ వార్డు పరిధిలో ఉన్న కుంట కట్ట దారిపై చదును పనులను బుధవారం చేపట్టారు. కుంట కట్టపై కొంతకాలంగా ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలు, చెత్తాచెదారంతో దుర్గంధపూరితంగా మారింది. ఈ దారిపై ప్రజలు నడవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డును బాగు చేయించాలని ప్రజలు విషయాన్ని స్థానిక వార్డు సభ్యుడు బందెల రాజు దృష్టికి తీసుకువెళ్లారు.

ఆయన కుంట కట్ట రహదారిపై నడవడానికి ప్రజలు పడుతున్న ఇబ్బందులను  సర్పంచ్ బైకాన్ జమున మహేష్, ఉప సర్పంచ్ చిలువేరి భూమేశ్వర్ లకు విన్నవించారు. వెంటనే స్పందించిన సర్పంచ్ కుంట కట్టదారిపై ముళ్ళ పొదలు, చెత్తాచెదారంను బ్లేడ్ టాక్టర్ తో తొలగించి శుభ్రం చేశారు. సమస్యను తమ దృష్టికి తీసుకువెళ్లిన వెంటనే స్పందించి పరిష్కరించిన సర్పంచ్ బైకాన్ జమున మహేష్, ఉప సర్పంచ్ చిలువేరి భూమేశ్వర్, వార్డు సభ్యుడు బందెల రాజు లకు వార్డు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -