టిఎస్ జెన్కో ఉన్నతాధికారులు
నవతెలంగాణ – మల్హర్ రావు
2013 భూ సేకరణ చట్టం ప్రకారం తాడిచెర్ల ఓసీపీ బ్లాక్-1కు డేంజర్ జోన్లో ఉన్న భూములను,ఇండ్లను సేకరిస్తామని జెన్కో ఉన్నతాధికారులు ప్రకటించీనట్లుగా తెలుస్తోంది. పదేళ్లుగా డేంజర్ జోన్లో ఉన్న ఇండ్లను తీసుకోవాలని నిర్వాసితులు తమ పొరాటాన్నీ ఉదృతం చేసిన నేపథ్యంలో జెన్కోఉన్నతాధికారుల పిలుపు మేరకు నిర్వాసితులు బుధవారం హైదరాబాద్ లోని మంత్రి శ్రీదర్ బాబు క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. మొదట నిర్వాసితులు మాట్లాడుతూ తమకు న్యాయం చేయాలని చేతులు జోడిచ్చి వేడుకొన్నారు.
ఇందుకు జెన్కో అధికారులు డేంజర్ జోన్లో ఉన్న ఇండ్లకు,భూములకు 2013 చట్టం,2010-11 సంవత్సరంలో ఇంటి నెంబర్లు వేసిన ఇండ్లకు మాత్రమే పరిహారం,ఆర్అండ్ఆర్ ప్యాకేజి ఇవ్వడం జరుగుతుందని జెన్కో అధికారులు వెల్లడించారు.ఇందుకు నిర్వాసితులు గగ్గోలు పెట్టి అయ్యా అప్పటి నుంచి తమ కుటుంబాల్లో కొడుకులు,బిడ్డలు ఎదిగారు కదా వారికి కూడా పరిహారం,ప్యాకేజి ఇవ్వాలని విన్నవించారు. ఇందుకు జెన్కో అధికారులు పెదవి విప్పకపోవడం విశేషం తాము ఏళ్లుగా ఓసిపి దుమ్ము,దూళితో నరకయాతన అనుభవిస్తున్నాం న్యాయం చేయాలని మహిళ నిర్వాసితులు మంత్రికి,జెన్కో ఉన్నతాధికారులకు విన్నవించారు.



