Wednesday, February 25, 2026
E-PAPER
Homeఖమ్మంసౌర విద్యుత్ ఉత్పత్తి విధానాన్ని పరిశీలన 

సౌర విద్యుత్ ఉత్పత్తి విధానాన్ని పరిశీలన 

- Advertisement -

సౌర విద్యుత్ ఉత్పత్తి పనులు త్వరగా పూర్తిచేయాలి 
టిజిఎన్పిడిసిఎల్ మేనేజింగ్  డైరెక్టర్ కె వరుణ్ రెడ్డి
నవతెలంగాణ – బోనకల్

ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోనే బోనకల్ మండల పరిధిలోని చిరునోముల, ముష్టికుంట్ల, కలకోట, బ్రాహ్మణపల్లి, గ్రామాలను టిజి ఎన్పీడీసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ కె వరుణ్ రెడ్డి సౌర విద్యుత్ పనులను బుధవారం పరిశీలించారు. అనంతరం విద్యుత్ వినియోగదారులతో మాట్లాడుతూ  సౌర విద్యుత్ వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. వినియోగదారులకు వచ్చే ప్రయోజనలను వివరించారు. ఆ గ్రామ సర్పంచ్ లు అనుమోలు చంద్రకళ, పిల్లలమర్రి నాగేశ్వరరావు, పైడిపల్లి అనిత లతో మాట్లాడి సౌర విద్యుత్తుల ప్రయోజనాలను వివరించారు.

బోనకల్ మండలంలోని 22 గ్రామాలకు  మోడల్ సోలార్  పథకం కింద గృహ వినియోగదారుల కోసం 2 కిలోవాట్ ఆన్ గ్రిడ్ సౌర విద్యుత్ వ్యవస్థలు, వ్యవసాయ మోటర్లకు 7.5 కిలోవాట్ గ్రౌండ్ మౌంటెడ్ సౌర ప్లాంట్ల వ్యవస్థ బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా విద్యుత్ అధికారులకు సౌర విద్యుత్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని వరుణ్ రెడ్డి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టిజి ఎన్పీడీసీఎల్ చీఫ్ ఇంజనీర్ ఐపిసి వెంకటరమణ, ఖమ్మం జిల్లా సూపరిండట్ ఇంజనీర్ ఈ శ్రీనివాసా చారి, కన్స్ట్రక్షన్  డివిజనల్ ఇంజనీర్స్ బద్రుపవర్, మధిర డివిజనల్ ఇంజనీర్ బండి శ్రీనివాసరావు, రెడ్కో మేనేజర్  పి అజయ్, కన్స్ట్రక్షన్ ఎడిఈ కిరణ్ చక్రవర్తి, బోనకల్  ఏ డి ఈ  వైవీ ఆనంద్ కుమార్, మండల ఏఈ తోకల మనోహర్,  బోనకల్ విద్యుత్ శాఖ లైన్మెన్లు, లైన్ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది ఆ గ్రామాల సర్పంచులు, విద్యుత్ వినియోగదారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -