Wednesday, February 25, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పసికందును చంపిన వారిపై చర్యలు తీసుకోవాలి

పసికందును చంపిన వారిపై చర్యలు తీసుకోవాలి

- Advertisement -

సొసైటీ వ్యవస్థాపకులు లింగమల్ల జ్యోతి-శంకరయ్య దంపతులు
నవతెలంగాణ – మల్హర్ రావు

నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో రజక కుటుంబంపై దాడిచేసి, పసికందును చంపిన హంతకులను వెంటనే అరేస్ట్ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆల్ ఎంప్లాయిస్ వెల్పేర్ సొసైటీ వ్యవస్థాపకులు లింగమల్ల జ్యోతి-శంకరయ్య దంపతులు బుధవారం ఒక సంయుక్త ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కులవివక్షకు గురైన చాకలి కుటుంబం, అగ్రకుల బలుపుకు, రెండు నెలల పసికందు ప్రాణాన్నీ బలిగొన్నారని ఈ సంఘటనను తీవ్రంగా ఖండించారు. ప్రపంచం సాంకేతిక పరిజ్ఞానంతో దూసుకుపోతుంటే కుమ్మెర గ్రామంలో దేవుని గుడిలోకి వస్తావా, మా దేవుని దర్శించుకుంటావా, సాకలి దాన అంటూ దుర్భషలాడి, చిత్రహింసలు పెట్టి, రెండు నెలల పసి గుడ్డును కసాయి కాలుతో తన్నితే క్షణంలో అక్కడే ప్రాణం విడిచిన పసిబిడ్డ తనువు చాలించిందన్నారు. దాడికి పాల్పడ్డ దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -