Wednesday, February 25, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్డేంజర్ జోన్ ఇండ్ల సేకరణ ప్రక్రియ ప్రారంభిస్తాం..

డేంజర్ జోన్ ఇండ్ల సేకరణ ప్రక్రియ ప్రారంభిస్తాం..

- Advertisement -

టిఎస్ జెన్కో సీఎండీ హామీ
నవతెలంగాణ – మల్హర్ రావు

తాడిచెర్ల ఓసీపీకి డేంజర్ జోన్లో ఉన్న ఇండ్ల,భూముల సేకరణ ప్రక్రియను త్వరలోనే ప్రారంభిస్తామని జెన్కో సిఎండి హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మంత్రి శ్రీదర్ బాబు చొరవతో నిర్వాసితులు, సిఎండితో బుధవారం మంత్రి ఛాంబర్ లో సమావేశం అయ్యారు .డేంజర్ జోన్లో నివసిస్తున్న భూనిర్వాసితుల ఎనిమిదేళ్ల పోరాటానికి సానుకూలంగా స్పందించిన్నట్లుగా తెలుస్తోంది.

డేంజర్ జోన్లో ఇళ్లను సేకరించి, భూములను సేకరించి అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని జెన్కో సీఎండీ ఎన్. హరీష్ స్పష్టమైన హామీ ఇచ్చారని గ్రామ సర్పంచ్ బండి స్వామి, ఉప సర్పంచ్ బొబ్బిలి రాజు గౌడ్, సమావేశానికి హాజరైన నిర్వాసితులు తెలిపారు. గత ఎనిమిదేళ్లుగా నిర్వాసితులు చేస్తున్న పోరాటానికి తెరపడనుందానే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో సీఎండీ హరీష్ మాట్లాడుతూ.. 2011-12 సర్వే ప్రాతిపదికన భూనిర్వాసితులకు పరిహారం, పునరావాసం కల్పిస్తామని తెలిపారు. దీనికి సంబంధించి తదుపరి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించనున్నట్లు పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో ఎనిమిదేళ్లుగా పోరాటానికి తెర పడే అవకాశాలు ఉన్నట్లుగా అభిప్రాయాలు తెలనున్నాయా.?..లేదా.? అనేది త్వరలో తేలనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -