Wednesday, February 25, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్భార్గవి హైస్కూల్లో విద్యార్థులకు అవగాహన

భార్గవి హైస్కూల్లో విద్యార్థులకు అవగాహన

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్
ట్రాఫిక్ నియమ నిబంధనలపై మండలంలోని అంకాపూర్ గ్రామంలోని భార్గవి విద్యానికేతన్ హైస్కూల్ లో విద్యార్థులను ఉద్దేశించి అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్యఅతిథిగా ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రఘుపతి హాజరై ట్రాఫిక్ నియమాలు ప్రతి ఒక్కరూ పాటించాలని నేటి యువత విద్యార్థులు ప్రజలు దీని పట్ల అవగాహన పెంచుకుని రోడ్డు ప్రమాదాలు నివారణ తోడ్పడాలని ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలని విద్యార్థులకు వివరించారు. అనంతరం ట్రాఫిక్ నియమ నిబంధనలపై పోస్టర్లను ఆవిష్కరణ చేసి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ప్రగతి పట్వారి డైరెక్టర్ గోపికృష్ణ , సామాజిక సేవకులు పట్వారి తులసి కుమార్ ,ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -