Thursday, February 26, 2026
E-PAPER
Homeసినిమాసూపర్‌ హిట్‌ ఖాయం

సూపర్‌ హిట్‌ ఖాయం

- Advertisement -

హీరో శ్రీ విష్ణు ‘విష్ణు విన్యాసం’తో అలరించబోతున్నారు. యదునాథ్‌ మారుతీ రావు దర్శకత్వంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్‌ బ్యానర్‌పై సుమంత్‌ నాయుడు జి నిర్మించారు. శ్రీ విష్ణు సరసన నయన్‌ సారిక హీరోయిన్‌గా నటించింది. ఈనెల 27న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్‌ ప్రీరిలీజ్‌ ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. శ్రీ విష్ణు మాట్లాడుతూ,’దర్శకుడు మారుతి చాలా కూల్‌గా ఉంటాడు. చాలా మంచి మనిషి. సినిమా తప్పితే మరో ప్రపంచం తెలీదు. విష్ణు విన్యాసం ఫస్టాఫ్‌ అంతా యూత్‌కి బాగా కనెక్ట్‌ అవుతుంది. సెకండ్‌ హాఫ్‌కి సినిమా ఫ్యామిలీ డ్రామాగా మారుతుంది. సినిమా పూర్తి అయ్యేసరికి ఒక మంచి సినిమా చూసిన అనుభూతి కలుగుతుంది.

ఇది ష్యూర్‌ షాట్‌ సూపర్‌ హిట్‌ సినిమా. హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి నవ్వుకోడానికి రండి. 100% నవ్వుకుంటారు. ఆ బాధ్యత నాది’ అని అన్నారు. ‘నాకు మనీషా క్యారెక్టర్‌ ఇచ్చిన డైరెక్టర్‌ మారుతికి థ్యాంక్యూ. శ్రీ విష్ణు నుంచి మీరు ఏవైతే కోరుకుంటున్నారో అన్ని ఎలిమెంట్స్‌ ఇందులో ఉంటాయి. సినిమా అదిరిపోతుంది. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది’ అని హీరోయిన్‌ నయన్‌ సారిక చెప్పారు. నిర్మాత కేకే రాధా మోహన్‌ మాట్లాడుతూ,’శ్రీ విష్ణు సినిమా చూస్తే మన కష్టాలు, బాధలన్నీ ఒక రెండు గంటలపాటు మర్చిపోతాం. అందుకే ఆయన కింగ్‌ ఆఫ్‌ ఎంటర్టైన్మెంట్‌. మారుతి చాలా అనుభవం ఉన్న దర్శకుడిలా సినిమాను తీశాడు’ అని అన్నారు. ‘విష్ణు నా మీద చాలా నమ్మకం పెట్టారు.

నేను చెప్పిన కథ తీయగలనని నమ్మారు. ఈ సినిమా ఇంత అద్భుతంగా రావడానికి కారణమైన విష్ణు, మా నిర్మాతలకి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సినిమా చూస్తున్నంత సేపు నవ్వుతూనే ఉంటారు’ అని డైరెక్టర్‌ మారుతి చెప్పారు. నిర్మాతలు మాట్లాడుతూ,’ఈ సినిమా 27కి రావడానికి కారణం హీరో శ్రీ విష్ణు. ఆయన లేకపోతే ఈ సినిమా అసలు వచ్చేది కాదు. ఆయన చేసిన సపోర్ట్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన్ని జీవితాంతం గుండెల్లో పెట్టుకుంటాం. ఈ సినిమా విషయంలో మేం చాలా హ్యాపీగా ఉన్నాం. విష్ణు డబ్బులు తీసుకువచ్చారు, అలాగే మా బ్యానర్‌కి పేరు కూడా తీసుకొచ్చారు’ అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -