నల్లకన్ను త్యాగాలను స్మరించుకున్న అభిమానులు
చెన్నై : జీవితాంతం ప్రజా సేవకు, సామాజిక న్యాయానికి అంకి తమైన ప్రముఖ కమ్యూనిస్టు నేత, స్వాతంత్య్ర సమరయోధుడు ఆర్. నల్లకన్ను (101) మృతితో కమ్యూ నిస్టు శ్రేణులతోపాటు అభిమానులు విషాదంలో మునిగిపోయారు. ఆర్ఎన్‌కె అని అందరూ అభి మానంతో పిలుచుకునే ఆయన పోలీసు క్రూరత్వాన్ని ధైర్యంగా ఎదిరించి ప్రజల పక్షాన పోరాడారు. 1925లో తూత్తుకుడి జిల్లా శ్రీవైకుం ఢంలో జన్మించిన ఆయన విద్యార్థి దశలోనే స్వాతంత్య్రోద్య మంలో పాల్గొన్నారు. 18 ఏళ్ల వయసులో కమ్యూనిస్టు పార్టీలో చేరారు. తాను ఉద్యోగం చేయాలని తన తండ్రి కోరుకున్నారని, దోతి, టవల్‌తో ఇంటిని విడిచిపెట్టి కమ్యూనిస్టు పార్టీ పూర్తికాలం కార్యకర్తగా మారానని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. శైవ, వైష్ణవ మఠాలు వ్యవసాయ కార్మి కులను దోపిడీ చేయడాన్ని వ్యతి రేకిస్తూ ఆయన పోరాడారు. సామాజిక అణచివేతకు గురైన పేదలతో కలిసి వీధుల్లో ప్రవేశిం చేందుకు ప్రయత్నించినప్పుడు ఆయ నను కట్టివేసి కొట్టారు. 1949లో నెహ్రూ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నించారని ఆరోపిస్తూ పెట్టిన నెల్లారు కుట్ర కేసులో పలువురు నాయకులతోపాటు ఆయనకు జీవిత ఖైదు విధించారు. ఆ కేసులో 1956లో ఆయన విడుదలయ్యారు. బ్రిటీష్ వారి హయాంలోనూ, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనూ చాలా ఏళ్లపాటు అజ్ఞాతంలో గడిపారు. పోలీసుల క్రూర హింసను అనుభవిం చారు. ఒక పోలీసు అధికారి సిగరె ట్‌తో ఆయన పెదవిని కాల్చివేశారు. ఒక స్నేహితుడి ఇంట్లో ఉండగా పోలీసులు పట్టుకుని తీవ్ర హింసకు గురిచేసినా, మిగిలిన నాయకుల వివరాలు వెల్లడించేందుకు నిరాకరిం చారు. జీవితాంతం సీపీఐ లోనే కొనసాగిన ఆయన 1992 నుండి మూడు పర్యాయాలు ఆ పార్టీ తమిళనాడు రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. తామిరబరణి నది పరీవాహక ప్రాంతం నుండి అక్రమంగా ఇసుకను తవ్వుతున్న ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా అవిశ్రాంతంగా పోరాడారు. 2010లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసి, మద్రాస్ హైకోర్టులో ఆయన వ్యక్తిగతంగా కేసును వాదించి, ఇసుక తవ్వకాలపై స్టే ఆర్డర్ పొందారు. 2022లో చెన్నైలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో తమిళనాడు సిఎం ఎంకె స్టాలిన్ ఆయనకు తగైసల్ తమిజార్ అవార్డును ప్రదానం చేశారు. అవార్డులో భాగంగా అంద జేసిన రూ.10 లక్షల నగదును తమిళనాడు ముఖ్యమంత్రి ప్రజా సహాయ నిధికి విరాళంగా ఇవ్వడంతో పాటు మరో రూ.5000 తన వంతుగా అందజేశారు. కమ్యూనిస్టు పార్టీలు మాత్రమే మతతత్వ బిజెపి, హిందూత్వ శక్తులకు వ్యతిరేకంగా లౌకిక శక్తులను ఏకతాటిపైకి తెచ్చి, ఎదుర్కోగలవని నమ్మిన ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకిచ్చే ఘన నివాళి అని పలు వురు ప్రముఖులు నివాళులర్పించారు.
పోరాట యోధుడు
- Advertisement -
- Advertisement -



