నవతెలంగాణ – గోవిందరావుపేట
మహిళా సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) అన్నారు. గురువారం మండలంలోని పసర గ్రామంలో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో సుమారు పదిలక్షల వ్యయంతో ఇందిరా మహిళా శక్తి ద్వారా నిర్మించే మహిళా సంఘాల భవన నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. మహిళలకు అన్ని రంగాలలో హక్కులు కల్పించాలని ప్రత్యేక పథకాలను అమలులోకి తీసుకు వస్తున్నాం. కోటి మంది మహిళలకు కోటి చీరల పంపిణీ చేస్తున్నాం.60 సంవత్సరాలు దాటిన వయోవృద్ధుల సంఘాల ఏర్పాటు చేస్తున్నామన్నారు. మహిళ సాధికారతకు ప్రజా ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని, మహిళలకు అన్ని రంగాలలో అభివృద్ధి లోకి తీసుకురావడానికి ప్రత్యేక పథకాలను అమలు చేస్తున్నామని, కోటి మంది మహిళలకు కోటి చీరలను పంపిణీ చేస్తున్నామని, వయో వృద్ధులకు భరోసా కల్పించడం కోసం 60 సంవత్సరాలు నిండిన వృద్ధులకు ప్రత్యేక మహిళా సంఘాలను ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. ప్రజా ప్రభుత్వం మహిళా సంఘాల ఉన్నతి తెలంగాణ ప్రగతి అనే లక్ష్యంతో మహిళలను అన్ని రంగాలలో అభివృద్ధి పథం లోకి తీసుకురావడానికి ఇందిరా మహిళా శక్తి పథకాన్ని అమలు చేస్తున్నామని ఈ పథకం ద్వారా అనేకమంది మహిళలు వివిధ వ్యాపార రంగాలలో రాణిస్తున్నారని పేర్కొన్నారు.
గ్రామాలలో ఉండే మహిళా సంఘాలు సమావేశాలకు నిర్వహించుకోవడానికి అనేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో వారికి శాశ్వత భవనాలు నిర్మించాలని దానిలో భాగంగానే జిల్లాకు దాదాపు 42 శాశ్వత భవనాలు మంజూరు చేయడం జరిగిందని స్పష్టం చేశారు.మేడారం శ్రీ సమ్మక్క సారమ్మ మహా జాతరలో మహిళా శక్తి పథకం ద్వారా మహిళలకు ప్రత్యేకంగా స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగిందని, వీటి ద్వారా వారికి రెట్టింపు ఆదాయం లభించిందని , మహిళలు స్వశక్తితో ఎదగడానికి వారికి సకాలంలో వడ్డీ లేని రుణాలు మంజూరు చేసి ఆర్థిక అభివృద్ధికి పాటుపడడం జరుగుతుందని పేర్కొన్నారు.
60 సంవత్సరాలు నిండిన మహిళలకు కూడా ప్రత్యేక సంఘాలను ఏర్పాటు చేయడమే కాకుండా సంఘంలోని సభ్యులు ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే 10 లక్షల రూపాయలు ఆర్థిక బీమా కల్పించడం జరుగుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్, డి ఆర్ డి ఓ శ్రీనివాస్, ఇతర అధికారులు, మహిళా సంఘాల సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.



