Thursday, February 26, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సొంత గూటిలో చేరిన తాండ్ర మల్లేష్

సొంత గూటిలో చేరిన తాండ్ర మల్లేష్

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు : మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామానికి చెందిన తాండ్ర మల్లేష్ తన సొంత గూటికి చేరారు. కొన్నేళ్ల క్రితం బీఆర్ఎస్ లో చేరి బుధవారం తిరిగి హైదరాబాద్ లో సచివాలయంలో రాష్ట్ర ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.మంత్రి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి అతనితోపాటు యూత్ నాయకుడు ఇందారపు సిద్దును సాదరంగా ఆహ్వానించారు. అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోరే నాయకుడు శ్రీధర్ బాబు కాబట్టి తన నేతృత్వంలో పని చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ట్రేడ్ చైర్మన్ ప్రకాష్ రెడ్డి, ఈజిఎస్ రాష్ట్ర సభ్యుడు దండు రమేష్, మాజీ సర్పంచ్ అశోక్ రావు, సర్పంచ్ బండి స్వామి, ఉప సర్పంచి బొబ్బిలి రాజు గౌడ్, కేశారపు చెంద్రయ్య, ఇందారపు చెంద్రయ్య, ఇందారపు శివ కుమార్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -