Thursday, February 26, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పెద్దతూండ్లలో నర్సరీ పనులు ప్రారంభం

పెద్దతూండ్లలో నర్సరీ పనులు ప్రారంభం

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు : హరిత వనోత్సవంలో భాగంగా జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం ద్వారా ప్రతి గ్రామంలో నర్సరీలో 15 వేల మొక్కలు పెంచి గ్రామాల్లోని అంతర్గత రోడ్డు, పొలాల గట్లపై నాటాలని ప్రభుత్వం సూచిస్తుంది. ఈ నేపథ్యంలో గురువారం పెద్దతూండ్ల గ్రామ సర్పంచ్ బండారి నర్సింగం ఆధ్వర్యంలో నర్సరీలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సర్పంచ్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తాళ్ళ రవీందర్, పంచాయతీ కార్యదర్శి సతీష్, వార్డు సభ్యులు బియని రాజమొగిలి, కేశవ్, దేవరాజ్, రమ, పిల్డ్ అసిస్టెంట్ సంతోష్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -