- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలం సుల్తాన్ పేట్ గ్రామంలో గురువారం గ్రామ సర్పంచ్ రాజేశ్వర్ గౌడ్ అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజేశ్వర్ గౌడ్ గ్రామ సమస్యలపై గ్రామస్తులతో చర్చించారు. గ్రామంలోని మురికి కాలువలు, దోమల బెడద, తాగు నీటి సమస్య , ఉపాధి హామీ,ఇందిరమ్మ ఇళ్లు , పలు సమస్యల పై గ్రామస్తులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజేశ్వర్ గౌడ్, ఉప సర్పంచ్ బాలరాజ్ సెక్రటరీ సంజయ్ జిపిఓ సత్యం,ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ యాదవ్ అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు, వార్డు సభ్యులు,గ్రామస్తులు పాల్గొన్నారు.
- Advertisement -



