నవతెలంగాణ – మద్నూర్
బిచ్కుంద ఎక్సైజ్ సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో ముమ్మర తనిఖీలు చేపట్టారు. వ్యక్తి ఎండు గంజాయిని అమ్ముతున్నాడని నమ్మదగిన సమాచారo మేరకు డోంగ్లి గ్రామంలో అంబాలాల్ అర్జున్ తండ్రి శ్యాం రావు వయస్సు 76 సంవత్సరాలు గల ఇతని ఇల్లును సోదా చేయగా 150 గ్రాముల ఎండు గంజాయి లభించినట్లు ఇట్టి గంజాయిని స్వాధీనం చేసుకొని అర్జున్ అనే వ్యక్తిని అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ తెలిపారు. అదేవిధంగా బోలక్ పల్లి గ్రామo వద్ద వాహనాల తనిఖీలు చేస్తుండగా సుంకరి సాయ గౌడ్ తండ్రి భూమా గౌడ్, వయస్సు 68 సంవత్సరాలు నివాసము వాజిద్ నగర్ గ్రామం బిచ్కుంద మండలం, తన ద్విచక్ర వాహనం నంబరు Ts 16 EG 4354, టీవీఎస్ ఎక్సెల్ పైన మూడు క్యాన్లు ఒక్కోటి 35 లీటర్లు కెపాసిటీ గల మొత్తం 105 లీటర్లు కల్లును అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడినాడు. ఇతన్ని అరెస్ట్ చేసి బండిని కల్లును కూడా స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు ఈ తనిఖీల్లో పాల్గొన్న వాళ్లు సిఐ సత్యనారాయణతో పాటు ఎస్సై నాగేష్, కానిస్టేబుళ్లు పరుశురాం, నవీన్ రెడ్డి మరియు శ్రీకాంత్ పాల్గొన్నట్లు వివరించారు. ఎవరైనా కళ్ళు అక్రమ రవాణా చేసిన అమ్మిన మరియు గంజాయిని డ్రగ్స్ ను ఎవరైనా తాగినా, అమ్మిన, కొని నా, రవాణా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ డ్రగ్స్, గంజాయి అనే మత్తు పదార్థాలు సమాజ శ్రేయసుకు విషo లాంటిది, సమాజాన్ని నిర్వీర్యం చేస్తుంది. కనుక వీటిపై ప్రభుత్వపరంగా కఠిన చర్యలు తీసుకుంటుంది. ప్రజలు కూడా సమాజ శ్రేయస్సు కోరేవారు కావున తమ వంతు ప్రయత్నం గా ఈ డ్రగ్స్ ను గంజాయిని నిర్మూలించడానికి తమ వంతు ప్రయత్నం గా తప్పనిసరిగా చేయాలని సీఐ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఎక్సైజ్ శాఖ ముమ్మరంగా తనిఖీలు గంజాయి, కళ్ళు తరలింపు పట్టివేత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



