Thursday, February 26, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సమాచార హక్కు చట్టం-2005 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

సమాచార హక్కు చట్టం-2005 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

- Advertisement -

నవతెలంగాణ – కామారెడ్డి 
కామారెడ్డి పట్టణంలో సమాచార హక్కు చట్టం – 2005 కు సంబంధించిన 2026 నూతన సంవత్సర క్యాలెండర్‌ను మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి ఆవిష్కరించారు. ఇటీవల నూతనంగా ఎన్నుకోబడిన చైర్పర్సన్‌ను సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పమొక్క అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ ఎం.ఏ. సలీం ఆధ్వర్యంలో 2026 సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి, కామారెడ్డి జిల్లాలో సమాచార హక్కు చట్టం – 2005 ను పగడ్బందీగా అమలు చేయడానికి కమిటీ సభ్యులు చేపడుతున్న అవగాహన సదస్సులు, ప్రజల్లో చైతన్యం కల్పించే కార్యక్రమాలను ప్రశంసించారు. సభ్యులందరికీ అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా ప్రజల హక్కుల పరిరక్షణకు కృషి చేయాలని ఆకాంక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -