నవతెలంగాణ – ములుగు: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్యకర్తలు అందరూ ఉద్యమాలను ఉదృతపరచాలని సీపీఐ(ఎం) పార్టీ ములుగు జిల్లా కార్యదర్శి బి రెడ్డి సాంబశివ పిలుపునిచ్చారు. గురువారం సీపీఐ(ఎం) పార్టీ మండల విస్తృతస్థాయి సమావేశం కడారి నాగరాజు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా బరితెగించిన సామ్రాజ్యవాదం అనే అంశంపై సెమినార్ జరిగింది ఏ సెమినార్ కు ముఖ్యఅతిథిగా సాంబశివ హాజరై మాట్లాడుతూ.. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అమెరికన్ సామ్రాజ్యవాదం అనుకూల విధానాలు అవలంబిస్తూ దేశాన్ని అధోగతి పాలు చేస్తుందని ఆరోపించారు. అమెరికాతో ఇటీవల చేసుకున్న పారిశ్రామిక వ్యవసాయ ఒప్పందాలు వలన దేశానికి తీరం నష్టం జరుగుతుందని అన్నారు. వ్యవసాయ ఉత్పత్తులు అమెరికా నుండి దిగుమతి చేసుకోవడం కోసం ప్రభుత్వం దిగుమతి సుంకాలను ఎత్తివేసిందని అన్నారు. దీని ద్వారా దేశంలో రైతులు పండించే ధాన్యానికి గిట్టుబాటు ధర ఉండదని పత్తి మిర్చి జొన్నలు అపరాలు విదేశాల నుండి మన దేశానికి వస్తాయని తెలిపారు. రష్యా నుండి ఆయిల్ బ్యారెల్ ధర 55 డాలర్లకు దిగుమతి చేసుకుంటే నేడు 66 డాలర్లకు దిగుమతి చేసుకోవడానికి ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని అన్నారు.
దీని ద్వారా దేశ సంపద లక్షల కోట్లు అమెరికాకి దోసి పెట్టుతుందని తెలిపారు. దేశంలో విద్యుత్ సవరణ చట్టం,విత్తన చట్టం, ప్రజలకి తీరని నష్టమని తెలిపారు. ఉపాధి హామీ చట్టాన్ని జవసత్వాలు లేకుండా చేశారని అన్నారు. కార్మికుల హక్కులు కాలరాచారని,కనీస వేతన చట్టం,కార్మికులకు సంఘం పెట్టుకునే హక్కు,సమ్మె చేసే హక్కు లేకుండా చేశారని పేర్కొన్నారు. ఇలాంటి విధానాలకు వ్యతిరేకంగా ప్రజలందరినీ ఐక్యం చేసి పోరాటాలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు తుమ్మల వెంకట్ రెడ్డి పొదిల చిట్టిబాబు గొంది రాజేష్ మండల కార్యదర్శి సోమ మల్లారెడ్డి, మండల కమిటీ సభ్యులు అంబాల మురళి,గుండు రామస్వామి, కోటి కృష్ణారావు, గోపిశెట్టి ఐలయ్య, కందుల రాజేశ్వరి, మారబోయిన సారయ్య, శ్రీరామోజు సువర్ణ, గొర్ల శ్రీనివాస్, యానాల ధర్మారెడ్డి కళ్లెం నారాయణ,,కమల, ఐలయ్య, తదితరులు పాల్గొన్నారు.



