– గంప గోవర్ధన్ చేతుల మీదుగా శాలువాలు, మెమోంటోలు అందజేత
నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి మున్సిపల్ పరిధిలో 46, 47వ వార్డుల కౌన్సిలర్లుగా గెలుపొందిన గెరిగంటి స్వప్న, లక్ష్మీనారాయణ దంపతులను గురువారం భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పార్టీ కామారెడ్డి నియోజకవర్గ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి మాజీ శాసనసభ్యులు గంప గోవర్ధన్, బీఆర్‌ఎస్ పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు యంకె ముజీబోద్దీన్ చేతుల మీదుగా శాలువాలు, మెమోంటోలు అందజేసి అభినందనలు తెలిపారు.
కామారెడ్డి మున్సిపల్ 7, 12, 17, 18, 27, 28, 31, 37, 45, 46, 47వ వార్డుల నుండి బీఆర్‌ఎస్ పార్టీ తరఫున గెలుపొందిన మొత్తం 11 మంది కౌన్సిలర్లను కూడా ఇదే కార్యక్రమంలో సన్మానించారు. పార్టీ బలోపేతానికి, ప్రజాసేవకు కట్టుబడి పనిచేయాలని కౌన్సిలర్ లకు సూచించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, మున్సిపల్ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంలో కౌన్సిలర్లు సమన్వయంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.



