నవతెలంగాణ – అశ్వారావుపేట
మానవసేవే మాధవ సేవ కావున ప్రతి విద్యార్థి స్వచ్ఛంద సేవకులై సమాజానికి తిరిగి ఇవ్వడం గురించి ఆలోచించాలని అసోసియేట్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ హేమంత కుమార్ ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లకు సూచించారు. రైతుల నుండి నేర్చుకోవడంతో పాటు వారితో విజ్ఞానాన్ని పంచుకోవడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. వ్యవసాయ కళాశాల ఆధ్వర్యం లో విద్యార్థుల బోధనా ప్రణాళిక లో భాగంగా వారం రోజుల జాతీయ సేవా పథకం కార్యక్రమాలను ప్రతీ ఏడాది నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో గురువారం మండలం లోని మల్లాయిగూడెం కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ జే.హేమంత కుమార్, స్థానిక సర్పంచ్ సంగం వెంకటమ్మ జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) పతాకాన్ని ఎగురవేసి, ఎగ్జిబిషన్ స్టాల్స్‌ను ప్రారంభించారు.
కార్యక్రమంలో విద్యార్థులతో పాటు వాసన్ టీమ్ మరియు జీవ రైతులు స్టాల్స్‌ను ఎర్పాటు చేశారు. మొదటి రోజు కార్యక్రమంలో భాగంగా రైతులు శాస్త్రవేత్తల ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు ఐ.వి. శ్రీనివాస్ రెడ్డి,ఎం. రాంప్రసాద్,జంబమ్మ,నీలిమ,టి. శ్రావణ్, కొత్తగూడెం కేవీకే శాస్త్రవేత్త హేమ శరత్ చంద్ర పాల్గొని రైతుల సమస్యలకు పరిష్కారాలను అందించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓలు రవిందర్,సతీష్,షకీరా బాను, హెచ్ ఈఓ ఈశ్వర్ పాల్గొని రైతులకు వ్యవసాయ పరికరాల సబ్సిడీ, రైతు నమోదు గురించి సమాచారం అందించారు. కార్యక్రమం జయప్రదం చేయాల్సిందిగా ప్రొఫెసర్స్, ఎన్.ఎస్.ఎస్. అధికారులు ఎ. శ్రీజన్, డి. స్రవంతి,పి. ఝాన్సీరాని స్తానిక ప్రజలను కోరారు. శిబిరం నిర్వహణకు మల్లాయిగూడెంను ఎంపిక చేసినందుకు విద్యార్థి వాలంటీర్లను సర్పంచ్ శ్రీమతి సంగం వెంకటమ్మ అభినందించారు మరియు శిబిరం సమయంలో వారి పూర్తి సహాకారాన్ని అందిస్తామని తెలిపారు .



