Thursday, February 26, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆర్ఐఎంసి ఫలితాల్లో సత్తా చాటిన చిదం సౌమ్య..!

ఆర్ఐఎంసి ఫలితాల్లో సత్తా చాటిన చిదం సౌమ్య..!

- Advertisement -

– విద్యార్థినికి పలువురి అభినందనలు
నవతెలంగాణ – మల్హర్ రావు

మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామానికి చెందిన చిందం భాస్కర్-హాసిని దంపతుల కూతురు చిందం సౌమ్య డెహ్రాడూన్‌లోని అత్యంత ప్రతిష్టాత్మకమైన రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో అసాధారణ ప్రతిభ కనబరిచి క్వాలిఫైయింది.తెలంగాణ స్టేట్ విభాగంలోనే ఒకేఒక అమ్మాయి పాస్ కావడం విశేషమైతే, దక్షిణ భారత దేశం నుండి ఇదే అమ్మాయి విజయం సాధించి అరుదైన రికార్డు సృష్టించడం మరో విశేషం. కాటారం ఆదర్శ హైస్కూల్ ఈ విద్యార్థిని ప్రతిభను గుర్తించి సహకారం అందించిన ప్రిన్సిపల్ కార్తీక్ రావుకు, మ్యాథమేటిక్స్ శిక్షణ అందించిన మనిస్ కుమార్ కు తల్లిదండ్రులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.భవిష్యత్తులో ఇండియన్ ఆర్మీలో ఉన్నత అధికారిగా దేశానికి సేవ చేయడమే తన ధ్యేయమని సౌమ్య ధీమాగా పేర్కొన్నారు. జాతీయ స్థాయి పోటీలో కాటారం ప్రాంతానికి కీర్తి తెచ్చిన సౌమ్యను, ఆమెకు అండగా నిలిచిన ప్రిన్సిపల్ కార్తీక్ రావును, మనీష్  కుమార్ ను పలువురు ప్రముఖులు అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -