నవతెలంగాణ – ఆత్మకూర్
తెలంగాణ సర్కార్ వెంటనే రాజీవ్ యువ వికాస పథకం అమలు చేయాలని తిరుమలగిరి మాజీ ఉప సర్పంచ్ మిర్యాల కుమార్ డిమాండ్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యువకులు, నిరుద్యోగులను నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు . .గురువారం విలేకరి తో పోన్ లో మాట్లాడుతూ కాంగ్రెస్కు గెలుపు ఆచ్చిన యువత, నిరుద్యోగులు ప్రత్యక్ష, పరోక్షంగా కార్యకర్తలుగా కృషి చేశారని గుర్తు చేశారు. అయితే ప్రభుత్వం వారిపట్ల సవతి తల్లి ప్రేమ కూడా చూపలేకపోతోందని ఆక్షేపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు మూడు నెలలు దాటుతున్నా, నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించకపోవడం ఆందోళనకరమని అన్నారు. కనీసం రాజీవ్ యువ వికాస పథకం ను వెంటనే అమలు చేయాలని స్పష్టం చేశారు.
రాజీవ్ యువ వికాస పథకం అమలుకు డిమాండ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



