నవతెలంగాణ – రాయపోల్
పీఎంశ్రీ పథకంలో ఎంపికైన రాయపోల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కేంద్ర పరిశీలకుల బృందం సందర్శించింది. గురువారం రాయపోల్ మండల కేంద్రంలో పాఠశాలలో కేంద్ర పరిశీలకులు ఐఏఎస్ శైలేంద్ర కుమార్ పాఠశాలలో అమలు చేస్తున్న కార్యక్రమాలను సమగ్రంగా పరిశీలించారు. పాఠశాల ప్రాంగణ పరిశుభ్రత, తరగతి గదుల నిర్వహణ, విద్యార్థుల హాజరు, బోధన విధానంపై సంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా లైబ్రరీ, సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్లను పరిశీలించి అందుబాటులో ఉన్న వసతులను అభినందించారు. ఆధునిక విద్యా విధానాలకు అనుగుణంగా 3డీ ప్రింటర్ వినియోగాన్ని మరింత విస్తరించేందుకు ప్రత్యేక ఇన్స్ట్రక్టర్ను నియమించుకోవాలని సూచించారు. పాఠశాలలో అమలు చేస్తున్న పీఎం శ్రీ కార్యక్రమాలు ఇతర పాఠశాలలకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ విషయాలను పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం. వెంకటేశ్వర్లు వెల్లడించారు. ఈ కార్జియక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాసరెడ్డి, ఏఎంవో రమేష్, ఏపీసి బేతి భాస్కర్, ఎంఈఓ రాజగోపాల్ రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
పీఎంశ్రీ రాయపోల్ పాఠశాలను సందర్శించిన కేంద్ర బృందం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



