Thursday, February 26, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తెలంగాణ ఉద్యమకారులను ప్రభుత్వం ఆదుకోవాలి

తెలంగాణ ఉద్యమకారులను ప్రభుత్వం ఆదుకోవాలి

- Advertisement -

నవతెలంగాణ -ఆత్మకూరు 
తెలంగాణ ఉద్యమకారులను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ..పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డిని గురువారం ఆయన నివాసంలో పరకాల నియోజకవర్గం తెలంగాణ ఉద్యమకారులు కలిసి విజ్ఞాపన పత్రం ఇచ్చారు.  కాంగ్రెస్ పార్టీ 2023లో శాసనసభ ఎన్నికల్లో ఉద్యమకారులకు ఇచ్చిన హామీల నెరవేర్చాలని, ఉద్యమకారుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని వారు ఎమ్మెల్యేను కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి సానుకులంగా స్పందిస్తూ ఉద్యమకారుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామి ఇచ్చారని వారు తెలిపారు. ఈకార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్ జిల్లా కార్యదర్శి ఇర్సడ్ల సదానందం, సందెల సునీల్,  మాజీకార్పొరేటర్ ల్యాదల్ల బాలు, గుర్రం రఘు, ప్రభాకర్, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మండల అధ్యక్షులు ఎండి బాబు మియా(చిరు) లక్కర్స్ లింగమూర్తి  పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -