Thursday, February 26, 2026
E-PAPER
Homeఖమ్మంపాఠశాల ను తనిఖీ చేసిన ఏఎంఓ నాగరాజ శేఖర్

పాఠశాల ను తనిఖీ చేసిన ఏఎంఓ నాగరాజ శేఖర్

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట 
అశ్వారావుపేట కాంప్లెక్సు పరిధిలోని చిన్నంశెట్టిబజార్ ప్రాధమిక పాఠశాల నిర్వహణ సమర్ధనీయంగా ఉందని అక్కడి ఉపాధ్యాయులు బాబూరావు, కావ్య ల పనితీరు ఆధర్శనీయంగా ఉందని జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి ఎ.నాగరాజశేఖర్ అన్నారు. ఆపాఠశాలలో జరుగుతున్న ఎఫ్.ఎల్.ఎన్ మూల్యాంకన నిర్వహణ ను ఆయన పరిశీలించారు. దానితోపాటు 3,5వతరగతి విద్యార్ధుల సామర్ధ్యాలను పరిశీలించారు. పాఠశాల రికార్డులను, విద్యార్ధుల వర్కబుక్స్,నోట్బుక్స్ లను పరిశీలించారు. ఉపాధ్యాయులు సమన్వయంతో సమర్ధవంతంగా పాఠశాలను నిర్వహిస్తున్నారని, విద్యార్ధుల సామర్ధ్యాలను పెంపొందించుటలోను గ్రంధాలయ నిర్వహణలోను ఉపాధ్యాయుల పనితీరు ఆదర్శవంతంగా ఉందని కితాబిచ్చారు.  ఆయన వెంట ఎఫ్.ఎల్.ఎన్ రిసోర్సుపర్సన్ శ్రీశైలం, కార్తీక్ లు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -