Friday, February 27, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఅందుకే.. ధైర్యంగా చెబుతున్నాం

అందుకే.. ధైర్యంగా చెబుతున్నాం

- Advertisement -

సుహాస్‌, శివానీ నాగారం జంటగా రూపొందిన చిత్రం ‘హే బల్‌వంత్‌’. గోపీ అచ్చర దర్శకుడు. త్రిశుల్‌ విజనరీ స్టూడియోస్‌ పతాకంపై బి.నరేంద్రరెడ్డి నిర్మించారు. బన్నీవాస్‌, వంశీనందిపాటి తమ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్‌, బన్నీవాస్‌ వర్క్స్‌ బ్యానర్స్‌పై ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇటీవల విడుదలైన ఈచిత్రం ప్రేక్షకుల విశేష ఆదరణతో బ్లాక్‌బస్టర్‌ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం తొలిసారి వినూత్నంగా థ్యాంక్స్‌ మీట్‌ ఫర్‌ బ్రేక్‌ ఈవెన్‌ డన్‌ ఈవెంట్‌ని నిర్వహించింది. నిర్మాత బి.నరేంద్రరెడ్డి మాట్లాడుతూ,’మా బ్యానర్‌లో వచ్చిన తొలి సక్సెస్‌ ఇది. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఎంతో సంతృప్తి చెందారు. ఓ మంచి సినిమా తీశానని అభినందించారు. కొన్ని థియేటర్లకు వెళ్ళి నేను ప్రేక్షకుల మధ్యలో కూర్చుని సినిమా చూశాను. అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు.

ఈ సినిమాని ఇంకా చూడని వారు ఎవరైనా ఉంటే చూడగలరని ఆశిస్తున్నాను’ అని అన్నారు. ”అంబాజీ పేట’ సినిమా తరువాత నా సినిమాల కలెక్షన్లు మినిమమ్‌ నెంబర్లు కూడా కనబడకపోవడంతో భయపడ్డాను. అయితే ఈ సినిమా వసూళ్ళు చూశాక ధైర్యం వచ్చింది. ఓవర్సీస్‌లోనూ మంచి కలెక్షన్లు వచ్చాయి. చాలా రోజుల తరువాత నా సినిమాకి ఓటీటీలో కూడా మంచి ఫ్యాన్సీ రేటు వచ్చింది’ అని హీరో సుహాస్‌ చెప్పారు. వంశీ నందిపాటి మాట్లాడుతూ,’ఈ సినిమాకి బ్రేక్‌ ఈవెన్‌ రావడం చాలా సంతోషంగా ఉంది. చాలా తక్కువ మంది మాత్రమే మా సినిమాకి బ్రేక్‌ ఈవెన్‌ అయ్యిందని ధైర్యంగా చెబుతారు. రానున్న రోజుల్లో లాభాల్లోకి వెళ్తాం. త్వరలోనే దర్శకుడు గోపీతో మరో సినిమా చేస్తున్నాం. ఇంకా సినిమా చూడని వారు ఉంటే తప్పకుండా చూడండి’ అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -