సాయి సింహాద్రి సైన్మా బ్యానర్‌పై సాయి సింహాద్రి హీరోగా, నిర్మాతగా చేసిన చిత్రం ‘సన్ ఆఫ్’. బత్తుల సతీష్ దర్శకుడు. ఈ సినిమా నేడు (శుక్రవారం) రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను వైభవంగా నిర్వహించారు. నిర్మాత, హీరో సాయి సింహాద్రి మాట్లాడుతూ,’దర్శకుడు సతీష్ ఈ కథ చెప్పినప్పుడు షాక్ అయ్యాను. ఆయన చెప్పిన కథ నా జీవితంలో జరిగినట్టే అనిపించింది. యదార్థ ఘటనలతో ఈ మూవీని తెరకెక్కించాం. తల్లి దండ్రులు వారసత్వంగా డబ్బుని కాకుండా కష్టపడే తత్వాన్ని ఇవ్వాలి. శోభారాణి వల్లే ఈ సినిమా ఈ స్థాయికి వచ్చింది. నేను 5 థియేటర్లు అడిగితే, ఆమె 300 థియేటర్లు ఇచ్చారు. మంచి కంటెంట్‌తో రూపొందిన ఈ చిత్రాన్ని తండ్రీకొడుకులు, ఫ్యామిలీ అంతా కలిసి చూడాల్సిన చిత్రమిది’ అని అన్నారు.
డిస్ట్రిబ్యూటర్ శోభారాణి మాట్లాడుతూ,’ఈ సినిమాని 300 థియేటర్లలో రిలీజ్ చేయటానికి కారణం ఈ సినిమాలోని కంటెంట్ బాగుంది కాబట్టి. అన్ని భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు’ అని తెలిపారు. ‘తండ్రీకొడుకుల సెంటిమెంట్‌తో ఈ సినిమా ఉంటుందని టైటిల్ చూస్తేనే తెలుస్తోంది. సాయి అమెరికా నుంచి ఇక్కడికి వచ్చి, ఇలాంటి ఓ గొప్ప సినిమా నిర్మించడం మంచి విషయం. ఆద్యంతం ప్రేక్షకులను అలరించే సినిమా ఇది అని కచ్చితంగా చెప్పగలను’ అని నటుడు, నిర్మాత అశోక్ కుమార్ చెప్పారు. ఈ వేడుకలో హీరోయిన్ మీరారాజ్, నిర్మాత రామసత్యనారాయణ, మ్యూజిక్ డైరెక్టర్ రిషి, పొలిటిషియన్, వ్యాపారవేత్త కన్నా రవి, రామకృష్ణగౌడ్, రమాదేవి, నిర్మాతలు వెంకట్, కరుణ లక్ష్మీ, శ్రీనివాస్, దర్శకుడు చరణ్, నైజాం డిస్ట్రిబ్యూటర్ వేణు, పూర్ణిమ, ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ తదితరులు పాల్గొని చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు.
300 థియేటర్లలో విడుదల
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



