- Advertisement -
పోలీసు క్రీడల్లో 3 పతకాలు కైవసం
నవతెలంగాణ-హైదరాబాద్
అడిషనల్ డిప్యూటీ కమిషనర్ (ఎస్‌ఓటీ) నంద్యాల నరసింహారెడ్డి తెలంగాణ పోలీసు క్రీడల్లో సత్తా చాటాడు. టెన్నిస్‌లో మూడు పతకాలు సాధించిన నరసింహారెడ్డి ఆల్ ఇండియా చాంపియన్‌షిప్ పోటీలకు అర్హత సాధించారు. పురుషుల సింగిల్స్‌లో కాంస్యం, డబుల్స్‌లో సిల్వర్ మెడల్ సాధించిన నంద్యాల.. టీమ్ ఈవెంట్‌లో మరో కాంస్యంతో తీన్‌మార్ మోగించారు. మూడు మెడల్స్‌తో జాతీయ పోటీలకు అర్హత సాధించిన నరసింహారెడ్డిని ఐపీఎస్ ఆఫీసర్ అవినాశ్ మహంతి గురువారం తన ఆఫీస్‌లో అభినందించి, ప్రశంసా పత్రం అందజేశారు.
- Advertisement -



