Saturday, August 23, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంకన్నడ చరిత్ర కమల్‌కేం తెలుసు? : సిద్ధరామయ్య

కన్నడ చరిత్ర కమల్‌కేం తెలుసు? : సిద్ధరామయ్య

- Advertisement -

బెంగళూరు: తమిళ సినీనటుడు కమల్‌ హసన్‌కు కన్నడ చరిత్ర ఏం తెలుసని కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రశ్నించారు. తన రాబోయే చిత్రం కోసం ఏర్పాటు చేసిన ఆడియో ఫంక్షన్‌లో కమల్‌ మాట్లాడుతూ కన్నడకు తమిళం జన్మనిచ్చిందంటూ చేసిన వ్యాఖ్య వివాదం రేపింది. కమల్‌ వ్యాఖ్యలపై సిద్ధరామయ్య బుధవారం మండిపడుతూ కన్నడ భాషకు ఉన్న సుదీర్ఘ చరిత్ర ఆ సినీ నటుడికి తెలియదని అన్నారు. ‘పాపం…కమల్‌ హసన్‌. ఆయనకు కన్నడం గురించి తెలియదు’ అని చెప్పారు. కాగా కమల్‌ వ్యాఖ్యలపై పలు కన్నడ సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రంలోని బెలగావి, మైసూర్‌, హుబ్బల్లి, బెంగళూరు సహా పలు నగరాలలో నిరసన ప్రదర్శలు జరుగుతున్నాయి. కమల్‌ బేషరతుగా క్షమాపణ చెప్పని పక్షంలో రాష్ట్రంలో ఆయన చిత్రాలను బహిష్కరిస్తామని కర్నాటక రక్షణ వేదిక (కేఆర్‌వీ) హెచ్చరించింది. కన్నడ రాజకీయ నాయకులు కూడా కమల్‌పై విమర్శలు కురిపించారు. కమల్‌ వ్యాఖ్యలు దురదృష్టకరమని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రిజ్వాన్‌ అర్షద్‌ అన్నారు. ఇదిలావుండగా ఈ వివాదానికి బీజేపీయే కారణమని డీఎంకే ప్రతినిధి టీకేఎస్‌ ఎలంగొవన్‌ చెప్పారు. కమల్‌ వ్యాఖ్యలను ఆయన సమర్ధించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad