విమాన ప్రయాణికులకు డీజీసీఏ ఊరట
న్యూఢిల్లీ : విమాన ప్రయాణికులకు టికెట్ రిఫండ్ నిబంధనలను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఎట్టకేలకు సవరించింది. కొత్త నిబంధనల ప్రకారం.. టికెట్ బుక్ చేసిన 48 గంటల్లోపు ప్రయాణికులు ఎటువంటి అదనపు చార్జీలు చెల్లించకుండానే టికెట్‌ను రద్దు చేసుకోవచ్చు లేదా ప్రయాణ తేదీల్లో మార్పులు చేసుకోవచ్చు. ఇందుకనుగుణంగా విమానయాన సంస్థలు తప్పనిసరిగా ప్రయాణికులకు అవకాశం కల్పించాలని డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది.
కాగా.. దేశీయ విమానాల్లో ప్రయాణానికి 7 రోజుల ముందు, అంతర్జాతీయ విమానాల్లో 15 రోజుల ముందు బుక్ చేసుకున్న టికెట్లకు మాత్రమే ఈ సదుపాయం వర్తిస్తుందని నిబంధన పెట్టింది. అదే విధంగా ట్రావెల్ ఏజెంట్ల ద్వారా బుక్ చేసినా సరే.. 14 పని దినాల్లోగా విమానయాన సంస్థలే రిఫండ్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. మెడికల్ ఎమర్జెన్సీ కారణాలతో ప్రయాణం రద్దు చేసుకోవాల్సి వస్తే.. ఆస్పత్రి ధ్రువీకరణ పత్రాల ఆధారంగా రిఫండ్ అవకాశాన్ని కూడా డీజీసీఏ మెరుగుపరిచింది. అదే విధంగా ఎయిర్‌లైన్ వెబ్‌సైట్ల ద్వారా నేరుగా బుక్ చేసుకున్న వారు 24 గంటల్లోపు తమ పేర్లలోని తప్పులను ఉచితంగా సరిదిద్దుకోవచ్చని అధికారులు వెల్లడించారు.
48 గంటల్లోపు ఉచితంగా టికెట్ రద్దు
- Advertisement -
- Advertisement -



