నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ కమిటీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కీలక ఖనిజ రంగంలో స్వయం సమృద్ధి సాధించడమే భారత్ లక్ష్యమని నిటి ఆయోగ్ నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ కమిటీ అభిప్రాయపడింది. గురువారం హైదరాబాద్‌లోని సింగరేణి భవన్లో కమిటీ చైర్మెన్ డాక్టర్ డీకే. సింగ్ అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో దేశంలో కీలక ఖనిజాల ఆవశ్యకత, లభ్యత, అన్వేషణ తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ సోలార్ విద్యుత్, బ్యాటరీలతో నడిచే వాహనాలు, ఎలక్ట్రానిక్ రంగ విస్తరణ, రక్షణ రంగంలో కీలక ఖనిజాల అవసరం ఎంతో ఉందన్నారు. దేశంలో కీలక ఖనిజ వనరులున్నప్పటికీ, వాటి మైనింగ్ జరగటం లేదని పేర్కొన్నారు.
దేశంలోని కీలక ఖనిజ వనరులను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తేవడానికి ప్రభుత్వ, ప్రయివేట్ మైనింగ్ సంస్థలు కలిసి నడవాలని సమావేశం ఆభిప్రాయపడింది. సింగరేణి సంస్థ సీఎండీ డాక్టర్ బుద్దప్రకాష్ జ్యోతి మాట్లాడుతూ సింగరేణి సంస్థ ఓపెన్ కాస్ట్ గనుల ఓవర్ బర్డెన్ మట్టి, థర్మల్ విద్యుత్ కేంద్రం నుండి వెలువడే ఫ్లై యాష్, బాటమ్ యాష్ల్లో దాగి ఉన్న క్రిటికల్ మినరల్స్‌ను వెలికితీయడానికి తమ వంతు కృషి చేస్తోందని తెలిపారు. జాతీయ కీలక ఖనిజ అవసరాలు తీర్చడంలో సింగరేణి తన వంతు బాధ్యతను నిర్వర్తిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యమ్రంలో కమిటీ మెంబర్ సెక్రెటరీ ఆర్. శరవణభవన్, సింగరేణి సంస్థ డైరెక్టర్లు కె.వెంకటేశ్వర్లు, టి.శ్రీనివాస్, జీఎం. బి.శ్రీనివాసరావు, ఐఎంఎంటీ, కోల్ ఇండియా, సీఎస్ఐఆర్-సీఈసీఆర్ఐ(కరైకుడి), గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, అదానీ, వేదాంత, లాయిడ్ మెటల్స్, హిందాల్కో, హిందుస్తాన్ జింక్, సన్ టెక్నాలజీస్ (చెన్నై) తదితర సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఖనిజరంగంలో స్వయం సమృద్ధే భారత్ లక్ష్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



