- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : టీచర్లకు ఆటోమేటిక్ పదోన్నతులు రద్దు చేసి, పనితీరు ఆధారంగానే ప్రమోషన్లు ఇవ్వాలని ప్రభుత్వానికి విద్యాకమిషన్ కీలక సూచనలు చేసింది. ఐదేళ్లకోసారి ఉపాధ్యాయుల పనితీరు అంచనా వేయడం తప్పనిసరి చేయాలని, రెండేళ్లలో మెరుగుపడకపోతే సర్వీస్ నుంచి తొలగించేలా నిబంధనలు మార్చాలంది. ఈ నిబంధన ఇకపై నియమించే ఉపాధ్యాయులకు వర్తింపచేయాలని అభిప్రాయపడింది. ఈ మేరకు నివేదికను సీఎం రేవంత్ రెడ్డికి అందజేసింది.
- Advertisement -



