Friday, February 27, 2026
E-PAPER
Homeకరీంనగర్మురుగు కాలువలో చెత్త తీయించిన సర్పంచ్ 

మురుగు కాలువలో చెత్త తీయించిన సర్పంచ్ 

- Advertisement -

నవతెలంగాణ – రామగిరి 
రామగిరి మండలం కల్వచర్ల గ్రామంలో ప్రగతి స్కూల్ లైన్ లో డ్రైనేజ్ కాలువలో పేరుకుపోయిన చెత్తాచెదారం, పిచ్చి మొక్కలు వలన కాలువ మొత్తం నిండిపోయి దుర్వాసన వెదజల్లుతోంది. దీంతో గ్రామస్థులు సర్పంచ్ రేండ్ల శారద కుమారస్వామికి సమాచారం అందించారు. వెంటనే స్పందించిన సర్పంచ్ జెసిబితో కాలువలో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తీసి వేయించారు. ఈ క్రమంలో సమస్యను పరిష్కరించిన సర్పంచ్ కి ప్రగతి స్కూల్ లైన్ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కల్వచర్ల సర్పంచ్ రేండ్ల శారద కుమారస్వామితో వార్డు సభ్యులు బండ సంపత్, గోనె రాము, రేండ్ల కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -