Friday, February 27, 2026
E-PAPER
Homeకరీంనగర్అక్రమ ఇసుక ట్రాక్టర్లు పట్టివేత

అక్రమ ఇసుక ట్రాక్టర్లు పట్టివేత

- Advertisement -

నవతెలంగాణ – శంకరపట్నం
మండల పరిధిలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్సై శేఖర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. శంకరపట్నం మండలంలోని కాచపూర్ గ్రామ శివారులో శుక్రవారం పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో వీణవంక మండలం కోర్కల్ గ్రామానికి చెందిన సంగి రాజు, నేదురు కనుకయ్యలు ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా రెండు ట్రాక్టర్లలో అక్రమంగా ఇసుకను తరలిస్తూ పట్టుబడ్డారు. దీంతో ఇద్దరు డ్రైవర్లపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -