– కామారెడ్డి డీపీఆర్ఓ
నవతెలంగాణ – కామారెడ్డి
రాష్ట్ర పౌర సంబంధాల సమాచార శాఖ (ఐ & పిఆర్) శాఖ రాష్ట్ర జిల్లా స్థాయి జర్నలిస్టులకు జారీ చేసిన అక్రిడిటేషన్ కార్డుల గడువును రెండు నెలల పాటు పొడిగించిందనీ కామారెడ్డి జిల్లా పౌర సంబంధాల సమాచార శాఖ (డీపీఆర్ఓ) అధికారి తిరుమల ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం అమల్లో ఉన్న అక్రిడిటేషన్ కార్డుల గడువు ఈనెల 28.02.2026తో ముగియనున్న నేపథ్యంలో, జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీల (డిఎంఎసి) ఏర్పాటు ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నందున, ఎస్ఎంఎసి, డీఎంఏసి సమావేశాలు నిర్వహించడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు కార్డుల గడువును 01.03.2026 నుండి 30.04.2026 వరకు రెండు నెలల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారన్నారు. ఈ మేరకు 24.02.2026 తేదీతో లేఖ నం. 003491/ ఎం ఆర్ /2024 ద్వారా అన్ని డిఎం ఎసి చైర్మన్లు, జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయబడ్డాయన్నారు. ప్రస్తుత జిల్లా జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డులు 30.04.2026 వరకు చెల్లుబాటు అవుతాయని ఐ , పిఆర్ శాఖ ప్రత్యేక కమిషనర్ సీహెచ్. ప్రియాంక తెలిపినట్లు ఆమె ఆ ప్రకటనలో పేర్కొన్నారు. రేపు మధ్యాహ్నం నుండి జర్నలిస్టులు డిపిఆర్ఓ కార్యాలయం నుండి స్టిక్కర్లను తీసుకోవాల్సిందిగా డీపీఆర్ఓ తిరుమల ఆ ప్రకటనలో తెలిపారు.



