నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండలంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల, మండల ప్రజా పరిషత్ పాఠశాలలో విద్యార్థిని, విద్యార్థులకు శుక్రవారం మండలంలోని పెద్ద ఏడ్గి గ్రామములోని జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో మండల టాలెంట్ టెస్టులు నిర్వహించడం జరిగింది. ఈ బాలోత్సవ కార్యక్రమానికి జుక్కల్ ఎంఈఓ తిరుపతి అయ్యా అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఏడ్గి గ్రామ సర్పంచ్ అస్పత్ వార్ అనిల్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన టాలెంట్ టెస్ట్ లో భాగంగా మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న ఎంపీపీ ఎస్ మరియు ఎంపీ యుపిఎస్ పాఠశాలల తెలుగు మరియు ఉర్దూ మీడియం విద్యార్థిని విద్యార్థులు అన్ని సబ్జెక్టులకు సంబంధించిన టాలెంట్ టెస్ట్ లు నిర్వహించడం జరిగింది.
తెలుగు , హిందీ ,ఇంగ్లీష్ ,సామాన్య శాస్త్రం ,గణితం , సాంఘిక శాస్త్రం, సబ్జెక్టులలో 50 మార్కుల ప్రశ్న పత్రాలతో కూడిన టాలెంట్ టెస్టులు నిర్వహించగా మండలంలోని ఐదవ తరగతికి చెందిన బస్వాపూర్ ఎంపీ యుపిఎస్ పాఠశాల విద్యార్థిని నందిని మొదటి బహుమతి, లొంగన్ ఎంపీపీ ఎస్ పాఠశాల విద్యార్థి సార్థక్ రెండవ బహుమతి , లొంగన్ పాఠశాలకు చెందిన పూజ రెండవ బహుమతి, వజ్రకండి ఎంపీ యుపిఎస్ పాఠశాల కు చెందిన జే. స్వప్న మూడవ బహుమతి, అదేవిధంగా ఉర్దూ మీడియం సంబంధించిన జెడ్పిహెచ్ఎస్ ఉర్దూ మీడియం జుక్కల్ విద్యార్థిని ముస్కాన్ ఫాతిమా మొదటి బహుమతి, ఎంపియపిఎస్ పెద్దగుల్లా ఉర్దూ మీడియం పాఠశాలకు చెందిన అయిజా , రెండవ బహుమతి, ఎంపీ యుపిఎస్ ఖండేబెల్లుర్ ఉర్దూ మీడియం పాఠశాలకు చెందిన విద్యార్థిని అలీనా మూడవ బహుమతి, డ్రాయింగ్ టెస్ట్ లో తెలుగు మీడియం కు చెందిన పవన్ ,విగ్నేష్, ,జ్ఞానేశ్వర్ , ఉర్దూ మీడియం కు సంబంధించిన పింజారి మహాక్ ఎంపియుపిఎస్ పెద్దగుల్ల , వాహీదా ఎంపీ యుపిఎస్ ఖండే బల్లూర్ , ఎస్ కే సభ జడ్పిహెచ్ఎస్ జుక్కల్ , బహుమతులు ప్రధానం చేసి జ్ఞాపికలను గ్రామ సర్పంచ్ చేతుల మీదుగా అందజేశారు. అంతకుముందు పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలలో విద్యార్థిని విద్యార్థులు ఉల్లాసంగా ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ అనిల్ తో పాటు ఎంఈఓ తిరుపతయ్య, జుక్కల్ క్లస్టర్ హెచ్ఎం హనుమంత రెడ్డి , ఖండేబల్లూర్ క్లస్టర్ లాలయ్య , కౌలాస్ క్లస్టర్ హెచ్ఎం యాదగిరి , ప్రధానోపాధ్యాయులు సబీనా బేగం, చంద్రకళ, జై చంద్, గోపాల్ , బాబు సార్, రాజేంద్రప్ప , అంజలి, అఖిల, రాజయ్య, జగదీష్, అశోక్, సంతోష్, భారతి, జైల్ సింగ్, డోన్గావ్ అశోక్ సార్, విజయలక్ష్మి శక్తి నగర్, గంగారాం, స్వరూప, హీరా జాదవ్, మండలంలోని వివిధ పాఠశాలల ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.



